జలమండలిలో 735 కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

by Batti.Sumithra |

జలమండలిలో 735 కొత్త పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సంతకం చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు, తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళ రాజి రెడ్డి తెలిపారు.

జలమండలిలో 735 కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
X

దిశ, హిమాయత్ నగర్ : జలమండలిలో 735 కొత్త పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సంతకం చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు, తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళ రాజి రెడ్డి తెలిపారు. జలమండలిలో 735 కొత్త పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున జలమండలి ఉద్యోగ, కార్మికులు, ఖైరతాబాద్, జలమండలి కేంద్ర కార్యాలయంలో గురువారం సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్యెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకట్ స్వామి, మొగుళ్ళ రాజి రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డికు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళ రాజి రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.పి.రాఘవేంద్ర రాజ్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆర్.డి.చంద్రశేఖర్, వై. నాగన్న గౌడ్ లకు శాలువా గజ మాలలు వేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా మొగుళ్ళ రాజి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని, పార్లమెంట్ సభ్యులు వేమ్ నరేందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఉత్తర్వులు విడుదల చేయడం అభినందనీయమని, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికు తెలంగాణ జలమండలి ఉద్యోగులు, కార్మికుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్ద కాలంపైగా జలమండలిలో కొత్త ఉద్యోగాల సృష్టి లేకుండా ఉన్న ఉద్యోగుల పై భారీ పని భారం పడేదని, ఉద్యోగ, కార్మికులకు ప్రమోషన్లు కూడా దక్కకుండా పోయాయని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత గత రెండున్నర ఏళ్ల కాలంలో టీజెఈయూ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి అనేక కార్మిక సమస్యలను పరిష్కరించబడ్డాయని తెలిపారు. కొత్త పోస్టుల భర్తీతో సీనియర్ ఉద్యోగ, కార్మికులకు త్వరలో ప్రమోషన్లు వస్తాయని అన్నారు. రాబోయే రోజుల్లో పెండింగ్ లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించడానికి కృషి చేస్తానని మొగుళ్ళ రాజి రెడ్డి మరోసారి హామీ ఇచ్చారు. టీజేఈయూ అసోసియేట్ ప్రెసిడెంట్ అల్లి శ్రవాన్ కుమార్, మేవ ప్రధాన కార్యదర్శి సయ్యిద్ అక్తర్ అలీ, నేతలు ఆనంద్ రెడ్డి, సి. రాజు, సిహెచ్. ప్రవీణ్ కుమార్, మజారుద్దీన్, తిరుపతి, బి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story