TG: సేవకు ప్రతిరూపం ప్రభుత్వ వైద్యశాలలు

by Gantepaka Srikanth |

లాభాపేక్ష లేకుండా ప్రతి రోగిని అక్కున చేర్చుకుని సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యశాలలే సేవకు ప్రతిరూపమని డీఎంఈ డా. ఎ. నరేంద్ర కుమార్ పేర్కొన్నారు.

TG: సేవకు ప్రతిరూపం ప్రభుత్వ వైద్యశాలలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: లాభాపేక్ష లేకుండా ప్రతి రోగిని అక్కున చేర్చుకుని సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యశాలలే సేవకు ప్రతిరూపమని డీఎంఈ డా. ఎ. నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. కాలానుగుణ సాంకేతిక పరిజ్ఞానాన్ని నర్సింగ్ రంగం స్వీకరించాలని, ఇలాంటి కాన్ఫరెన్స్‌ల ద్వారా నూతన విజ్ఞానాన్ని నేర్చుకోవాలని సూచించారు. రోగులకు నర్సులు అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని తెలిపారు. నీలోఫర్ హాస్పిటల్ లో శనివారం 2వ రాష్ట్ర స్థాయి నర్సింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాట్కో బిల్డింగ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల నుంచి 200 మందికి పైగా నర్సింగ్ ఆఫీసర్లు హాజయ్యారు. నర్సింగ్ వృత్తిలో రోల్ మోడల్‌గా నిలబడాలని, నిబద్ధత, పరస్పర గౌరవం, నాణ్యమైన సురక్షితమైన రోగి సేవలు కీలకమని పేర్కొన్నారు.

నిరంతర విద్య, వర్క్‌షాప్‌ల ద్వారా నైపుణ్యాలను అప్‌డేట్ చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ట్రెయిన్డ్ నర్సస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ అధ్యక్షురాలు డాక్టర్ రాజేశ్వరి, తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ విద్యులత, యశోద హాస్పిటల్ (సికింద్రాబాద్) నర్సింగ్ విభాగం జనరల్ మేనేజర్ డాక్టర్ జ్యోతి శర్మ, నిలోఫర్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్, సీఎస్‌ఆర్‌ఎమ్‌వో డాక్టర్ ఆనంద్, నియోనెటాలజీ విభాగాధిపతి డాక్టర్ స్వప్న, టీజీజీడీఏ సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలు ప్రసాద్, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్లు బాలమణి, కరుణ, తెలంగాణ ప్రభుత్వ నర్సెస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ లక్ష్మణ్ రుడావత్ తదితరులు హాజరయ్యారు.

Next Story