- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సొసైటీ చైర్మన్ వేధింపులు తాళలేక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య!
by S Gopi |
దిశ, కేసముద్రం: సొసైటీ చైర్మన్ వేధింపులు తాళలేక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న..Government employee commits suicide over 'harassment'

X
దిశ, కేసముద్రం: సొసైటీ చైర్మన్ వేధింపులు తాళలేక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అన్నేపక రామచంద్రయ్య(53) కేసముద్రం సింగిల్ విండో బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగి. అయితే, తన అవసరం నిమిత్తం బ్యాంక్ నుండి లక్ష రూపాయలు రుణం తీసుకున్నాడు. కొంత డబ్బులు తిరిగి చెల్లించాడు. మిగిలిన డబ్బులు చెల్లించాలని సింగిల్ విండో చైర్మన్ ఫోన్ చేస్తున్నారని.. అయితే, అతని దగ్గర డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు. మృతినికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Next Story






