Google లో ఎలాంటి యాడ్‌లు లేకుండా 1,000 యాప్‌లు

by Web Desk |
Google లో ఎలాంటి యాడ్‌లు లేకుండా 1,000 యాప్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలోని ఆండ్రాయిడ్ డివైజ్‌లకు నెలకు రూ. 99 లేదా సంవత్సరానికి రూ. 889కి తన ప్లే పాస్ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకురానున్నట్లు గూగుల్ సోమవారం ప్రకటించింది. Google Play Pass సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ఎలాంటి ప్రకటనలు లేకుండా1,000 యాప్‌లు, గేమ్‌లను అందిస్తుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్రస్తుతం 90 దేశాల్లో అందుబాటులో ఉంది. ఈ సేవ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, భారతీయ డెవలపర్‌లు కూడా "వారి గ్లోబల్ యూజర్ బేస్‌ను విస్తరించడానికి, కొత్త ఆదాయ మార్గాలను పొందడానికి ఉపయోగపడుతుందని" గూగుల్ పేర్కొంది. Google ప్రతి నెలా కొత్త గేమ్‌లు, యాప్‌లను ప్రవేశపెట్టడానికి గ్లోబల్, లోకల్ డెవలపర్‌లతో కలిసి పని చేస్తూనే ఉంటుంది. యాప్‌ను ఎలాంటి ప్రకటనలు లేకుండా లేదా యాప్‌లో కొనుగోలు ఆప్షన్స్ లేకుండా ఉచితంగా ఉపయోగించవచ్చు. ప్లే పాస్‌లో జంగిల్ అడ్వెంచర్స్, వరల్డ్ క్రికెట్ బాటిల్ 2, మాన్యుమెంట్ వ్యాలీ వంటి ప్రసిద్ధ గేమ్‌లు, అట్టర్, యూనిట్ కన్వర్టర్, ఆడియోల్యాబ్ వంటి యుటిలిటీ యాప్‌లు, అలాగే ఫోటో స్టూడియో ప్రో, కింగ్‌డమ్ రష్ ఫ్రాంటియర్స్ టిడి వంటివి ఉన్నాయి.

సబ్‌స్క్రైబర్‌లు Play Pass ట్యాబ్ ద్వారా లేదా Play Storeలో బ్రౌజ్ చేస్తున్నప్పుడు Play Pass "టికెట్" కోసం సెర్చ్ ద్వారా యాప్‌లు, గేమ్‌లకు యాక్సెస్ పొందవచ్చు. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ Android వెర్షన్ 4.4, Google Play Store యాప్ వెర్షన్ 16.6.25, అంతకంటే ఎక్కువ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.



Next Story

Most Viewed