TG: మేడారం జాతర వేళ మహిళలకు శుభవార్త

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-20 12:01:55  IST  )

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

TG: మేడారం జాతర వేళ మహిళలకు శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర(Medaram Jathara) ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తాజాగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాతరకు నాలుగు వేల బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతరకు నాలుగు వేల బస్సులు, 51 పాయింట్స్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మేడారం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంటుంది.. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. రవాణా శాఖ నుంచి పదివేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు. 28 నుంచి 1వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. మేడారం వెళ్ళేటప్పుడు బస్సులు నిండుతాయి.. వచ్చేటప్పుడు ఖాళీగా బస్సులు వస్తాయని అన్నారు. వన్ వేలో బస్సులు ఖాళీగా వెళ్తాయి కాబట్టి.. రెగ్యులర్ ఛార్జిల కంటే 50శాతం అదనపు ఉంటాయని వెల్లడించారు.

‘పాత నాలుగు జిల్లాలు వరంగల్, కరీంనగర్ ఆదిలాబాద్ స్పెషల్ స్పాట్స్. మేడారంలో పర్మినెంట్ షెల్టర్స్ ఏర్పాటు చేశాము. ఒక్క నిమిషంలో నాలుగు బస్సులు వెళ్లేలా ఏర్పాట్లు. ఆర్టీసీ బస్సుల కోసం 50 క్యూ లైన్స్ - 9 కిలోమీటర్లు ఏర్పాటు. ఒకేసారి వెయ్యి బస్సులు పార్కింగ్ చేసేలా వసతులు కల్పించాం. భక్తులు - ప్రయానికులు జాగ్రత్తగా వెళ్లండి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

Next Story