- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ట్రైన్లలో అందుబాటులోకి వెండింగ్ మెషీన్లు
రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వేస్ (South Central Railways) గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వేస్ (South Central Railways) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ (Waltair Railway Division) పరిధిలో సుదూర ప్రాంతాలకు రైళ్లలో వెళ్లే ప్రయాణికుల ప్రధాన సమస్య అయిన నాణ్యమైన టీ, కాఫీ కొరతను తీర్చేందుకు అధునాతన వెండింగ్ యూనిట్ల (Vending units)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నం - న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
సాధారణంగా ప్యాంట్రీ కార్లలో లేదా బయట ప్లాట్‌ఫారమ్‌లపై లభించే పానీయాల నాణ్యతపై ప్రయాణికులు అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు, విక్రయదారులకు ప్రత్యేకంగా రూపొందించిన 5 లీటర్ల సామర్థ్యం గల వెండింగ్ క్యాన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వెండింగ్ మెషీన్ల ద్వారా తయారవ్వడం వల్ల పానీయాల నాణ్యతలో స్థిరత్వం ఉండనుంది. థర్మల్ ఇన్సులేషన్ (Thermal Insulation) కలిగిన క్యాన్ల వల్ల ప్రయాణికులకు కాఫీ, టీలు ఎప్పుడూ వేడిగానే అందుతాయి. శీతల పానీయాల పంపిణీలో గరిష్ట స్థాయిలో పరిశుభ్రత పాటించేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, రైళ్లలో కూడా వెండింగ్ మెషీన్లు తీసుకురావడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






