నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 731 పోస్టులతో నోటిఫికేషన్

by Malleboina Mahesh |

SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ విడుదల! 731 గ్రేడ్-C, D పోస్టుల భర్తీకి ఇంటర్ అర్హతతో దరఖాస్తులు ఆహ్వానం. మే 15 ఆఖరి తేదీ.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 731 పోస్టులతో నోటిఫికేషన్
X

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'C'చ గ్రేడ్ 'D' పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 731 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులు వచ్చే నెల మే 15వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫీజు చెల్లింపునకు మే 16 వరకు సమయం ఇచ్చారు.

అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హత సాధించాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండటంతో పాటు, తప్పనిసరిగా స్టెనోగ్రఫీ (షార్ట్‌హ్యాండ్) లో నైపుణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి విషయానికొస్తే.. గ్రేడ్ 'C' పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, గ్రేడ్ 'D' పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి (వయస్సు ఆగస్టు 1, 2026 నాటికి లెక్కించబడుతుంది). ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) జూలై లేదా ఆగస్టు 2026 లో నిర్వహించబడుతుంది. ఇందులో అర్హత సాధించిన వారికి స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం SSC కొత్త అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ను సందర్శించవచ్చు.

Next Story