- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telugu News > మెగాస్టార్‌కు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ టికెట్ ధరల పెంపు
మెగాస్టార్‌కు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ టికెట్ ధరల పెంపు
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించి టికెట్ ధరలను పెంచుతూ తాజాగా తెలంగాణ సర్కార్ అనుమితినిచ్చింది. అదేవిధంగా జనవరి 11న సాయంత్రం 8 గంటల నుంచి రాష్ట్రంలో స్పెషల్ ప్రీమియర్ షోలకు ప్రదర్శించుకోవచ్చని.. అందుకు టికెట్ రేటును రూ.600గా నిర్ణయించినట్లుగా ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు. వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్స్‌లలో సాధారణ టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి రూ.100 అదనంగా పెంచుకునేందుకు పర్మీషన్ ఇచ్చారు. రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవడానికి కూడా సర్కార్ వెసులుబాటును కల్పించింది.
Read More..
చిరు సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Next Story






