- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరు సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12న విడుదలకానుంది. కాగా ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12న విడుదలకానుంది. కాగా ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సినిమా విడుదలకు ముందు రోజున జనవరి 11న ప్రీమియర్స్ వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ప్రీమియర్స్ టికెట్ ధర రూ.500గా నిర్ణయించింది.
అదే విధంగా జనవరి 12 నుండి పదిరోజుల పాటు సింగిల్ స్క్రీన్ టికెట్ ధర రూ.100, మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.125గా నిర్ణయించింది. అంతే కాకుండా రోజుకు ఐదు షోలు వేసకునేందుకు మాత్రమే ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇదిలా ఉంటే మన శంకర వరప్రసాద్ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. వెంకటేష్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ రావిపూడి, వెంకటేష్ హిట్ కొట్టగా ఈ ఏడాది చిరంజీవి ఎలాంటి వినోదాన్ని పంచుతారన్నది ఆసక్తికరంగా మారింది.






