తెలంగాణకు గుడ్ న్యూస్.. 6 అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు లైన్ క్లియర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-20 17:29:36  IST  )

రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణకు గుడ్ న్యూస్.. 6 అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు లైన్ క్లియర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ‘నగర్ వన్ యోజన’ (Nagar One Yojana) పథకం కింద రాష్ట్రంలో కొత్తగా 6 అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ, తొలి విడతగా రూ.8.26 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఈ కొత్త పార్కులు అందుబాటులోకి రానున్నాయి. నగర కాలుష్యాన్ని తగ్గించి, ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే ఈ పార్కుల ప్రధాన ఉద్దేశమని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆరు కొత్త అర్బన్ ఫారెస్టులలో ఆదిలాబాద్ జిల్లా మావల, యాపల్‌గూడ-II, మంచిర్యాల జిల్లా ఇందారం, చెన్నూర్, మేడ్చల్ జిల్లా యెల్లంపేట, చెంగిచెర్లలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అర్బన్ ఫారెస్ట్ పార్కుల పనులు ప్రారంభం కానున్నాయి.

Next Story