తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

by Gantepaka Srikanth |

సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ రూ.1.2 కోట్ల ప్రమాద బీమా సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బీమా పథకాన్ని బ్యాంకుల సహకారంతో అమలు చేస్తున్నామని, దీని వల్ల ప్రభుత్వం లేదా సంబంధిత సంస్థలపై అదనపు ఆర్థికభారం ఉండదని ఇప్పటికే ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా నిర్వహించడంతో పారదర్శకత, వేగంగా ఉంటాయని అన్నారు. బీమా పథకం ద్వారా ఉద్యోగి విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందితే లేదా శాశ్వత వైకల్యం ఏర్పడితే కుటుంబానికి ఆర్థిక భరోసా లభించనుంది.

Next Story