తెలంగాణ రైతులకు శుభవార్త.. ఈ నెల 22న రైతు భరోసా' నిధుల విడుదల

by Malleboina Mahesh |   (  Updated:2026-03-15 13:35:52  IST  )

ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల కానున్నాయి.

తెలంగాణ రైతులకు శుభవార్త.. ఈ నెల 22న రైతు భరోసా నిధుల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల వాగ్దానం లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రైతు భరోసా' ('Rythu Bharosa') పథకం నిధులను ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడత నిధుల విడుదల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. గత కొంతకాలంగా ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.

ఈ పథకం ప్రారంభోత్సవానికి సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదిక కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా మొదటి విడత (First installment) నిధులను అధికారికంగా విడుదల చేస్తారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో భాగంగా ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 3,590 కోట్ల నగదు జమ కానుంది. అలాగే 20 రోజుల అనంతరం రెండో విడతలో రూ. 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరున మూడవ విడత నిధులు రూ. 9 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం అందించిన రైతు బంధు స్థానంలో, పెంచిన పెట్టుబడి సాయంతో 'రైతు భరోసా'ను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిధుల విడుదల ద్వారా సాగు పనులకు అవసరమైన ఖర్చుల కోసం రైతులకు ఆర్థిక భరోసా లభించనుంది.

Next Story