సమ్మక్క-సారక్క భక్తులకు గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్‌లో మేడారం సమాచారం!

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-13 13:06:33  IST  )

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారక్క మహా జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు అట్టహాసంగా జరగనుంది.

సమ్మక్క-సారక్క భక్తులకు గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్‌లో మేడారం సమాచారం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారక్క (Sammakka-Saarakka) మహా జాతర ఈనెల 28 నుంచి 31 వరకు అట్టహాసంగా జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తాజాగా, భక్తుల కోసం సౌకర్యం కోసం జాతర అప్‌డేట్స్ తెలుసుకునేందుకు ‘మై మేడారం’ (MyMedaram) పేరుతో స్పెషల్ వాట్సాప్ చాట్ బాట్ (WhatsApp Chatbot) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

కాగా, భక్తులు 7658912300 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేయడం ద్వారా జాతరకు చేరుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉన్న మార్గాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, వాహనాల రద్దీ, ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు, ఇబ్బందులు తెలియజేసేందుకు కంప్లయింట్ డెస్క్, జాతర రద్దీలో ఎవరైనా తప్పిపోతే వారి వివరాలను తెలుసుకోవడం లేదా తప్పిపోయిన వారి వివరాలను నమోదు చేసే సదుపాయం ‘మై మేడారం’ మొబైల్ యాప్ ద్వారా కల్పించారు. ఈ సేవలు కేవలం వాట్సాప్‌లోనే కాకుండా అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవార్లను దర్శించుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

Read More... ‘మేడారం మహా జాతరకు 3 కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉంది’: మంత్రులు

Next Story