ఆశావహులకు గుడ్ న్యూస్.. కరీంనగర్ జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

by Malleboina Mahesh |

కరీంనగర్ రాజకీయాల్లో కొత్త జోష్! ఉమ్మడి జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు. నియోజకవర్గాల పునర్విభజనపై ఆశావాహుల్లో మొదలైన చర్చ.

ఆశావహులకు గుడ్ న్యూస్.. కరీంనగర్ జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
X

దిశ, కరీంనగర్ బ్యూరో: దేశవ్యాప్తంగా పార్లమెంట్, అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలు జిల్లా వ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తోంది. శాసనసభ, పార్లమెంటు ఆశావాహుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 119 నుంచి 179 కి అసెంబ్లీ స్థానాలు పెరగనుండగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 16 పార్లమెంట్ స్థానాల నుంచి 26 పెరగనున్నాయి. అందుకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టనున్నారు అనే వార్తలు కొత్త ఊహగానాలు రేకెత్తిస్తున్నాయి.

జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను పెంచే ప్రక్రియకు శ్రీకారం చుడుతుంది అనే వార్తలు ఆశావాహుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తుండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 అసెంబ్లీ స్థానాలకు గాను కొత్తగా మరో మూడు లేదా నాలుగు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉండటంతో నియోజకవర్గాల పునర్విభజన పై చర్చ మొదలైంది. నిజయోజకవర్గాలు పెరిగితే జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు ఏవి అనేది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ జోరందుకుంది ఇప్పటికే రచ్చబండలు కూడల్ల వద్ద కొత్త నియోజకవర్గాలు పునర్విభజన ఎలా ఉండబోతుంది, కాగా మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏ నియోజకవర్గాలు మహిళకు కెటాయిస్తారు ఎస్సీ రిజర్వేషన్లు ఏ నియోజకవర్గాలకు కేటాయిస్తారు అనే అంశాలపై చర్చ జరుగుతుంది

మారనున్న పార్లమెంట్ స్థానాల పరిధి

కేంద్రం పార్లమెంట్ స్థానాలను కూడా పెంచడంతో ఇప్పటి వరకు ఉన్న పార్లమెంట్ స్థానాలు భౌగోళికంగా మార్పులు జరగనున్నాయి. దీంతో పార్లమెంటు పరిధి తగ్గడంతో పాటు పార్లమెంట్ స్థానాలు పెరగనున్నాయి. అయితే పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలను ఏ విధంగా మార్చనున్నారు అనేది ఇప్పటి వరకు స్పష్టత లేకపోగా సోషల్ మీడియాలో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి అనే వార్తలు వైరల్ గా మారి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎవరి ఊహగానాల్లో వారు ఊరేగుతున్నరు. ప్రస్తుతం పార్లమెంటు పరిధి ఇలా మారనుంది. ఇన్ని అసెంబ్లీ స్థానాలు ఏర్పడనున్నాయి అంటూ లెక్కలు వేస్తున్నారు.

Next Story