బడ్జెట్ లెక్కలు మారినా.. మాస్ లెక్కలు తేలాల్సిందే!

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-24 04:14:27  IST  )

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna) వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు.

బడ్జెట్ లెక్కలు మారినా.. మాస్ లెక్కలు తేలాల్సిందే!
X

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna) వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ‘వీరసింహా రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య - గోపీచంద్ మలినేని (Gopichand Malineni)కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. NBK-111 వర్కింట్ టైటిల్‌తో రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. అయితే, మొదట ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో కూడిన పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. కానీ, బడ్జెట్ పరిమితులు దృష్ట్యా ఈ కథను పక్కన పెట్టి, బాలయ్య ఇమేజ్‌కు సరిపోయే పక్కా మాస్ యాక్షన్ కథను గోపీచంద్ మలినేని సిద్ధం చేశారు. ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా ఒక పవర్‌ఫుల్ సోషల్ కథతో రాబోతున్నదని తెలుస్తోంది. ఎవరి ఊహకూ అందని రీతిలో ఈ కథ ఉంటుందని సమాచారం.

ఇటీవలే ఈ కొత్త స్టోరీ లైన్‌ను బాలయ్యకు చెప్పగా దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చే మార్చి నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. తొలి షెడ్యూల్‌లోనే బాలయ్య మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట. కథ మారిన నేపథ్యంలో, గతంలో అనుకున్న నయనతారే హీరోయిన్‌గా కొనసాగుతారా లేదా కొత్త కథకు తగ్గట్టుగా మరో హీరోయిన్‌ను తీసుకుంటారా అనే విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య మార్క్ డైలాగులు, గోపీచంద్ మలినేని టేకింగ్ కలిసి మరోసారి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు.

Read More..

తమిళ దర్శకుడితో బాలకృష్ణ సినిమా

Next Story