- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళ దర్శకుడితో బాలకృష్ణ సినిమా
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇటీవల అఖండ 2 తాండవం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించినమేర విజయం సాధించలేదు. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసిన ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇటీవల అఖండ 2 తాండవం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించినమేర విజయం సాధించలేదు. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసిన ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తరవాత బాలయ్య గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ కథా చిత్రంగా ఈ సినిమా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇది మార్చిలో విడుదల కానుందని టాక్. కాగా ఇప్పుడు బాలయ్యకు ఓ తమిళ దర్శకుడు సైతం కథను వినిపించినట్టు సమాచారం అందుతోంది. తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ బాలయ్యకు ఓ కథ చెప్పారట. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా బాలయ్యను మెప్పించగా అతడితో ఓ సినిమా చేయాలని అనుకున్నారట. ఈ నేపథ్యంలోనే బాలయ్యకు ఓ కథ లైన్ వినిపించగా తెగనచ్చేసిందని సమాచారం. ఇక బాలయ్య ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే వీరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.






