కిస్మత్‌పూర్‌లో తాళం వేసిన ఇంట్లో చోరీ.. బంగారం, నగదు అపహరణ

by Jakkula.Mamatha |

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్‌పూర్ వివేకానంద కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది.

కిస్మత్‌పూర్‌లో తాళం వేసిన ఇంట్లో చోరీ.. బంగారం, నగదు అపహరణ
X

దిశ, రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్‌పూర్ వివేకానంద కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురానికి చెందిన జె.సుబ్బరామి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కిస్మత్ పూర్‌లో నివాసం ఉంటున్నాడు. అనంతపూర్‌లో నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులను పరిశీలించేందుకు అనంతపురానికి వెళ్లారు. అనంతరం కిస్మత్ పూర్ తిరిగి వచ్చి చూడగా ఇంటి ప్రధాన తలుపు తాళం పగులగొట్టి ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఉన్న ఇనుప అల్మారాను ధ్వంసం చేసి, అందులో ఉన్న సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.20 వేల నగదు, హాల్‌లో ఉన్న జూట్ బ్యాగ్‌లోని రూ.2 వేల చిల్లర నగదు, ఒక మొబైల్ ను గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story