- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో.. ఈ కరెంట్ బిల్లు చూస్తే షాకే!
దిశ, గోదావరిఖని టౌన్: కరెంట్ బిల్లును చూసి వారు షాక్ కు గురయ్యారు. ఆ బిల్లు చూసిన..Godavarikhani: Power bills shock consumers

దిశ, గోదావరిఖని టౌన్: కరెంట్ బిల్లును చూసి వారు షాక్ కు గురయ్యారు. ఆ బిల్లు చూసిన తర్వాత వారు షాక్ నుండి తేరుకుందుకు చాలా సమయం పట్టింది.. ఇంత బిల్లు ఎప్పుడు చూడలేదని, పేదవారు అయిన వారు దానిని ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ పీకే రామయ్య కాలనీకి చెందిన విజయ్ మండల్ నిరుపేద కుటుంబం కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నడూ లేనంతగా ఈ నెల కరెంటు బిల్లు రూ.30,738 వచ్చి వారిని షాక్ కు గురి చేసింది. రోజు కూరగాయలు అమ్ముకుని జీవించేవారికి ఇంత కరెంట్ బిల్లు రావడంతో ఏమిచేయాలో అర్థం కాలేదు. వెంటనే స్థానిక కార్యాలయానికి వెళ్లి బిల్లు గురించి ఆరా తీశారు. అయితే అధికారులు తమకు సంబంధం లేదని చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చారు. ఏమిచేయాలో పాలుపోక బోరున విలపిస్తున్నారు. అంత డబ్బు తాము జీవితం మొత్తం కష్టపడ్డ కట్టలేమని అంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు మీటర్లపై విచారణ జరిపించి ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.






