- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వింతలకే వింత.. బర్రెలకు డైపర్లు.. లేదంటే జరిమానా
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం తీసుకున్న ఒక వింత నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం తీసుకున్న ఒక వింత నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'సుత్రా పంజాబ్' కార్యక్రమంలో భాగంగా నగరాల్లో, పట్టణాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడానికి, బయోగ్యాస్ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం "గోబర్ ట్యాక్స్" అనగా పేడపై పన్నును ప్రవేశపెట్టింది. ఈ నిబంధన ప్రకారం.. పశువుల యజమానులు ప్రతి బర్రెకు రోజుకు 30 పాకిస్తానీ రూపాయలను పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పన్ను చెల్లించడంలో విఫలమైతే భారీ జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించడంతో పశువుల కాపరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ పన్ను భారం నుంచి తప్పించుకోవడానికి అక్కడి రైతులు అవలంబిస్తున్న మార్గం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "పేడ వేస్తేనే కదా పన్ను కట్టాలి.. అసలు పేడ కింద పడకుండా చేస్తే పన్ను తప్పుతుంది" అనే వింత ఆలోచనతో కొంతమంది రైతులు తమ బర్రెలకు డైపర్లు కడుతున్నారు. నిజానికి ప్రభుత్వం డైపర్లు వేయాలని ఎక్కడా అధికారికంగా ఆదేశించలేదు, కానీ పన్ను కట్టలేక రైతులు స్వయంగా తీసుకుంటున్న ఈ కామెడీ నిర్ణయం ఇప్పుడునెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. బర్రెలు డైపర్లు వేసుకుని ఉన్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో మీమ్స్‌గా మారి హల్చల్ చేస్తున్నాయి. ఈ పరిణామంపై సామాజిక మాధ్యమాల్లో సెటైర్ల వర్షం కురుస్తోంది. "ఈరోజు పేడ మీద పన్ను వేశారు, రేపు మనుషులపై కూడా ఇలాంటి వింత పన్నులు వేస్తారేమో" అని ప్రజలు ఎగతాళి చేస్తున్నారు.






