విద్యుత్ ఘాతంతో మేక మృతి.. ప్రభుత్వ సాయం కోరిన గొర్రెల కాపరి

by Ratna Kumari |

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామ లంబాడి తండాకు చెందిన గుగులోత్ రవి జీవనోపాధి కోసం మేకలను మేపుకుంటూ జీవిస్తున్నాడు.

విద్యుత్ ఘాతంతో మేక మృతి.. ప్రభుత్వ సాయం కోరిన గొర్రెల కాపరి
X

దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామ లంబాడి తండాకు చెందిన గుగులోత్ రవి జీవనోపాధి కోసం మేకలను మేపుకుంటూ జీవిస్తున్నాడు. ప్రతిరోజులాగే గురువారం తనకు చెందిన మేకలను మేతకు తీసుకెళ్లగా, అనుకోకుండా ఓ మేక విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. మృతి చెందిన మేక విలువ సుమారు రూ.10 వేల వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనతో తనకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసిన రవి, ప్రభుత్వం స్పందించి తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

Next Story