- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తగా ప్రపోజ్ చేస్తానని చెప్పి ప్రియుడిని సజీవదహనం చేసిన ప్రియురాలు
బెంగళూరులో ప్రేరణ అనే యువతి తన ప్రియుడు కిరణ్‌కు కళ్లకు గంతలు కట్టి, కొత్తగా ప్రపోజ్ చేస్తానని నమ్మించి పెట్రోల్ పోసి సజీవదహనం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రేమించిన యువకుడిని ఇంట్లో ఎవరూ లేరని పిలిచి పెట్రోల్ పోసి తగలబెట్టింది ఓ ప్రియురాలు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులోని బైదరహళ్లిలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక టెలికాం స్టోర్‌లో పనిచేసే ప్రేరణ (27), అదే స్టోర్‌లో పనిచేసే కిరణ్ గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, సరిగ్గా అటెన్షన్ ఇవ్వడం లేదని ప్రేరణ కక్ష పెంచుకుంది. ఈ క్రమంలోనే అతడిని అంతమొందించాలని పథకం వేసిన నిందితురాలు, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కిరణ్‌ను రమ్మని పిలిచింది. వెస్ట్రన్ స్టైల్‌లో కొత్తగా ప్రపోజ్ చేస్తానని నమ్మబలికి, కిరణ్‌ను బెడ్‌కు తాళ్లతో కట్టేసి, కళ్లకు గంతలు కట్టింది.
ఏం జరుగుతుందో కిరణ్ ఊహించేలోపే, ప్రేరణ అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటల్లో చిక్కుకున్న కిరణ్ ఆర్తనాదాలు చేయడంతో గమనించిన స్థానికులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. కానీ, అప్పటికే కిరణ్ తీవ్ర గాయాలతో సజీవదహనమయ్యాడు. అత్యంత కిరాతకమైన విషయం ఏమిటంటే, కిరణ్ మంటల్లో కాలిపోతున్న దృశ్యాలను ప్రేరణ తన మొబైల్‌లో వీడియో తీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బైదరహళ్లి పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






