దాడి.. బాలికకు తీవ్ర గాయాలు..

by Batti.Sumithra |

మెదక్ పట్టణం నవాబ్‌ పేట్ లో వీధి కుక్క దాడిలో హేమ (06) బాలిక తీవ్రంగా గాయపడింది.

దాడి.. బాలికకు తీవ్ర గాయాలు..
X

దిశ, మెదక్ టౌన్ : మెదక్ పట్టణం నవాబ్‌ పేట్ లో వీధి కుక్క దాడిలో హేమ (06) బాలిక తీవ్రంగా గాయపడింది. స్థానికుల కథనం ప్రకారం ఇంటి సమీపంలో హేమ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వీధి కుక్క దాడి చేసి కరిచింది. దీంతో బాలికకు శరీరం పై తీవ్రగాయాలు అయ్యాయి. బాలిక కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించి కుక్కను తరిమికొట్టి ఆమెను రక్షించారు. మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

Next Story