- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్ని పార్టీలు అదే చేశాయి.. గులాం నబీ అజాద్ సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.- latest Telugu news

శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఏమి జరిగిన పాకిస్తాన్‌తో పాటు ఉగ్రవాదానిదే బాధ్యత అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు కూడా మత, కుల ప్రతిపాదికన ప్రజలను విడదీశారని తెలిపారు. మహాత్మ గాంధీ అతిపెద్ద హిందువు, లౌకికవాది అని నేను నమ్ముతున్నాను. జమ్ముకశ్మీర్‌లో ఏమి జరిగిన పాకిస్తాన్, ఉగ్రవాదానిదే బాధ్యత. అది హిందువులను. కశ్మీరీ పండిట్లను, కశ్మీరీ ముస్లింలను, డోగ్రాలను ప్రభావితం చేసింది అని అన్నారు. రాజకీయ పార్టీలన్ని కుల, మతం పేరిట విభజనకు కారణమయ్యాయని తెలిపారు. నేను నా పార్టీతో సహా దేనిని విడిచిపెట్టను. పౌర సమాజం కలిసికట్టుగా ఉండాలి అని అన్నారు. కాగా, ప్రస్తుతం కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ప్రముఖ రాజకీయ నేతలు స్పందిస్తున్న నేపథ్యంలో గులాం నబీ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.






