Ghani: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: గని OTT రిలీజ్ డేట్ ఫిక్స్..!

by Disha Web Desk 19 |
Ghani: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: గని OTT రిలీజ్ డేట్ ఫిక్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గని'(Ghani). కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలైంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన గని.. ప్రేక్షకులను పూర్తిగా నిరాశపర్చింది. అసలు ఈ సినిమా వచ్చి.. పోయిందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కేజీఎఫ్ 2, బీస్ట్ వంటి సినిమాల పోటీ తట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద పూర్తిగా ఢీలా పడింది గని మూవీ.

దీనితో మేకర్స్ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 22న 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో గని చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. జగపతిబాబు, నదియా, ఉపేంద్ర, సునీల్ శెట్టి వంటి అగ్ర నటులు ఉన్నప్పటికి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లలో ప్రభావం చూపని ఈ సినిమాను.. ఓటీటీలో అయిన సినీ ప్రియులు ఆదరిస్తారేమో చూడాలి మరీ.

Next Story

Most Viewed