భారత యువతకు జర్మనీ రెడ్ కార్పెట్.. వీసా నిబంధనలు సరళం: ప్రధాని మోడీ

by Malleboina Mahesh |

భారత ప్రధాని నరేంద్ర మోడీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఇరు దేశాల మధ్య కుదిరిన కీలక ఒప్పందాలను వెల్లడించారు.

భారత యువతకు జర్మనీ రెడ్ కార్పెట్.. వీసా నిబంధనలు సరళం: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశం (Joint press conference)లో ఇరు దేశాల మధ్య కుదిరిన కీలక ఒప్పందాలను వెల్లడించారు. ప్రధానంగా వలసలు (migration), మొబిలిటీ, నైపుణ్యాభివృద్ధి (skilling) పై ప్రత్యేక దృష్టి సారించినట్లు మోడీ తెలిపారు. భారతీయ యువత జర్మనీ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ బంధాన్ని మరింత బలపరుస్తూ ‘గ్లోబల్ స్కిల్స్ పార్టనర్‌షిప్’పై ఇరువురు నేతలు ఉమ్మడి ప్రకటన చేశారు. ఈ ఒప్పందం వల్ల ముఖ్యంగా వైద్య రంగంలోని నిపుణులు (healthcare professionals) ఉద్యోగ రీత్యా జర్మనీకి వెళ్లేందుకు మార్గం మరింత సులభతరం కానుంది.

అలాగే, ఉన్నత విద్య, క్రీడల రంగంలోనూ సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా జర్మన్ యూనివర్సిటీలు తమ క్యాంపస్‌లను భారత్‌లో ఏర్పాటు చేయాలని మోడీ ఆహ్వానించారు. భారతీయ పౌరుల కోసం జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (German Chancellor Merz) ప్రకటించిన ‘వీసా-ఫీ ట్రాన్సిట్ ఫెసిలిటీ’ (visa-fee transit facility) పట్ల మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలు ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని ఈ సందర్భంగా భారత ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

Next Story