2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతం

by Muthe.Rajitha |

భారత ఆర్థిక వ్యవస్థ మరోసారి ప్రపంచ దేశాల అంచనాలను తారుమారు చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టించింది.

2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతం
X

దిశ, వెబ్ డెస్క్ : భారత ఆర్థిక వ్యవస్థ మరోసారి ప్రపంచ దేశాల అంచనాలను తారుమారు చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టించింది. తాజాగా కేంద్ర గణాంక కార్యాలయం విడుదల చేసిన ప్రావిషనల్ ఎస్టిమేట్స్ (Provisional Estimates) ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరం (FY 2025-26)లో భారత GDP ఏకంగా 7.7% వృద్ధి రేటును నమోదు చేసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా పలు ఆర్థిక సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు 7.4% నుండి 7.6% లోపు మాత్రమే ఉండవచ్చని అంచనా వేయగా, వాటన్నింటినీ మించి భారత ఎకానమీ ఈ అద్భుతమైన ప్రగతిని సాధించడం విశేషం. అంతేకాదు ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం అయిన Q4 (జనవరి-మార్చి 2026) లో అయితే మరింత జోరుగా సాగి 7.8% గా నమోదైంది. మేక్ ఇన్ ఇండియా ఊతంతో మాన్యుఫాక్చరింగ్ రంగం అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.

అటు ఐటీ, బ్యాంకింగ్, టూరిజం వంటి సేవా రంగాలు కూడా ఎగుమతులలో (Exports) సరికొత్త మైలురాళ్లను అధిగమించాయి. కేంద్ర ప్రభుత్వం రహదారులు, రైల్వేలు, పోర్టులపై పెట్టిన పెట్టుబడులు, క్యాపెక్స్ (CapEx) నిధుల విడుదల మార్కెట్‌లో భారీగా ఉపాధిని సృష్టించడంతో పాటు ప్రైవేట్ పెట్టుబడులకు కూడా మార్గం సుగమం చేసింది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్నప్పటికీ.. భారత్ 7.7% వార్షిక వృద్ధిని సాధించడం ద్వారా, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.

Next Story