- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే గ్యాస్ కొరత : మంత్రి పొన్నం ప్రభాకర్
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే వంటగ్యాస్ పైన ప్రజల్లో ఆందోళన రేగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల దేశానికి గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి వంటగ్యాస్, కమర్షియల్ సిలిండర్ల కొరత తీవ్రమైందని, ఈ సంక్షోభం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండగా, సామాన్యులు గ్యాస్ బుకింగ్స్, డెలివరీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా కూడా రాష్ట్రానికి అవసరమైన గ్యాస్ ను తీసుకురాలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని, వంటగ్యాస్ కి సంబంధించి ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గ్యాస్ కొరత లేనప్పుడు గ్యాస్ ధరలు ఎందుకు పెంచారో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఎందుకు సమాధానాలు చెప్పడం లేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గ్యాస్ తో పాటు భవిష్యత్తులో ఎరువుల కొరత సంభవించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయని, తక్షణమే కేంద్రం గ్యాస్, ఎరువుల కొరతను రాకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోందని, రాష్ట్రానికి అవసరమైన గ్యాస్ సరఫరా పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.






