- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LPG Gas Price(June 07): తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే?
దేశంలోని మధ్య తరగతి కుటుంబాలపై మరోసారి ధరల భారం పడింది.

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల(జూన్) ఒకటో తేదీన చమురు కంపెనీలు వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పెంపుతో హైదరాబాద్‌లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,367కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. దేశంలోని మధ్య తరగతి కుటుంబాలపై మరోసారి ధరల భారం పడింది. తాజాగా గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ. 29 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంచిన ధరలు ఇవాళ్టి(జూన్ 7) నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో ప్రస్తుతం హైదరాబాద్‌లో గృహ వినియోగ ఎల్‌పిజి(14.2 కేజీల) సిలిండర్ ధర రూ.994.00గా ఉంది, ఇది గత నెల ధర అయిన రూ.965.00తో పోలిస్తే పెరిగింది. ఈ తరుణంలో ఇవాళ(జూన్ 07) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్: రూ.994.00
వరంగల్: రూ.1013.00
విశాఖపట్నం: రూ.950.00
విజయవాడ: రూ.966.50
గుంటూరు: రూ.966.50






