- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LPG Gas Price(June 1): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ నెల(జూన్) ఒకటో తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని మళ్లీ పెంచగా.. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్‌లో గృహ వినియోగ ఎల్‌పిజి(14.2 కేజీల) సిలిండర్ ధర రూ.965.00గా ఉంది. గత నెల(మే)తో పోలిస్తే గృహ వినియోగ ఎల్‌పిజి ధరలో ఎలాంటి మార్పు నమోదు కాలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,367గా ఉంది. ఇటీవల పెరిగిన ధరలు జూన్ 1వ తేదీ నుంచైన తగ్గుతాయెమో అని వినియోగదారులు ఆశపడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది. దీంతో హోటల్ యజమానులు, క్యాటరింగ్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు(సోమవారం) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
జూన్ 1వ తేదీ నాటి గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్: రూ.965
వరంగల్: రూ.984
విశాఖపట్నం: రూ.921
విజయవాడ: రూ.937.50
గుంటూరు: రూ.937.50






