- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LPG Gas Price(May 21): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు
ఈ రోజు(మే 21) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ఉద్రిక్తతల(ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం) కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశీయ వంట గ్యాస్(LPG) సిలిండర్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో గత నెలలో ఇంట్లో ఉపయోగించే సాధారణ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 60 పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ. 965కు చేరుకుంది. ఇప్పటికీ నగరంలో గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ, ఈ నెల(మే) ఒకటో తేదీన చమురు కంపెనీల వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,069కు చేరుకుంది. ఈ రోజు(గురువారం) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మే 21వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్: రూ.965.00
వరంగల్: రూ. 984.00
విశాఖపట్నం: రూ. 921.00
విజయవాడ: రూ. 937.50
గుంటూరు: రూ. 937.50






