LPG Gas Price(May 15): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-05-15 02:26:49  IST  )

ఈ రోజు(మే 15) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

LPG Gas Price(May 15): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ఉద్రిక్తతల(ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం) కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశీయ వంట గ్యాస్(LPG) సిలిండర్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. గత నెలలో ఇంట్లో ఉపయోగించే సాధారణ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 60 పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ. 965కు చేరుకుంది. ఇప్పటికీ నగరంలో గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ, ఈ నెల(మే) ఒకటో తేదీన చమురు కంపెనీల వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,069కు చేరుకుంది. ఈ రోజు(మే 15) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మే 15వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ.965.00

వరంగల్: రూ. 984.00

విశాఖపట్నం: రూ. 921.00

విజయవాడ: రూ. 937.50

గుంటూరు: రూ. 937.50

Next Story