సెకండ్ షో సినిమాకు వెళ్లిన వైద్యురాలు.. మర్చిపోలేని రాత్రిని చేసిన కామాంధులు

by Disha Web Desk 19 |
సెకండ్ షో సినిమాకు వెళ్లిన వైద్యురాలు.. మర్చిపోలేని రాత్రిని చేసిన కామాంధులు
X

దిశ, వెబ్‌డెస్క్: కామాంధులు రోజురోజుకు చెలరేగిపోతున్నారు. కొందరు.. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు రాక్షసుల్లా మీద పడి కామవాంఛ తీర్చుకుంటున్నారు. దేశంలో రోజు ఏదో ఓ చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు విధించిన వీరిలో మార్పు రావడం లేదు. తాజాగా నలుగురు యువకులు ఓ యువ వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని వేల్పూర్‌లో ఓ యువతి వైద్యురాలిగా పనిచేస్తోంది. కాగా, మూడురోజుల క్రితం సరదాగా స్నేహితులతో కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లింది.

సినిమా అయిపోగానే తిరిగి వేల్పూర్‌కు రాత్రి తన స్నేహితుడితో కలిసి షేర్ ఆటోలో బయలుదేరింది. అయితే అప్పటికే ఆటోలో ఉన్న నలుగురు యువకులు.. యువతి వెళ్లే వైపు కాకుండా ఆటోను దారి మల్లించారు. ఆటోను పాలారు నది ఒడ్డుకు తీసుకెళ్లి.. ఆమె స్నేహితుడిపై దాడి చేసి అక్కడి నుండి తరిమికొట్టారు. అనంతరం యువతిపై దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులకు విషయం తెలియడంతో దర్యాప్తు ప్రారంభించి నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.


Next Story

Most Viewed