- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాపర్ వైర్ దొంగల ముఠా అరెస్ట్
గత కొద్ది కాలంగా బెల్లంపల్లి సింగరేణి శాంతి ఖనీ మైన్ ఏరియాలో కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, మంచిర్యాల: గత కొద్ది కాలంగా బెల్లంపల్లి సింగరేణి శాంతి ఖనీ మైన్ ఏరియాలో కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కేసుకు సంబంధించిన వివరాలు సీఐ హనూక్ వెల్లడించారు. గత కొన్ని రోజుల క్రితం శాంతి ఖనీ సింగరేణి మైన్ వద్ద కాపర్ వైర్ దొంగతనం పై సంబంధిత అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ సిహెచ్ కిరణ్ కుమార్ ఇబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించగా అక్కడ కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి పది కిలోల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. దొంగతనం చేసిన వారిలో పాస్తం.గోపాల్, కలమంచి.అశోక్, కలమంచి. కళ్యాణ్, పాస్తం.వీరాస్వామి, పార్థన్. గణేష్, రాజ.సమ్మయ్య, పాస్తం. సారయ్య నిందితుల వివరాలు వెల్లడించారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న ఎస్సై కిరణ్ కుమార్ ను సీఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ శిరీష, హెచ్. సి హేమ.సుందర్, బెల్లంపల్లి ఐడి పార్టీ హెచ్. సి రాజేశ్వర్, శ్రీనివాస్, రాము సిబ్బంది ఉన్నారు.






