- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో PM తర్వాత గంభీర్‌దే అత్యంత కష్టమైన పని.. ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆసక్తికర వ్యాఖ్యలు, పోస్టులు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

దిశ, వెబ్ డెస్క్: ఆసక్తికర వ్యాఖ్యలు, పోస్టులు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను భారత ప్రధాని మోడీ తో పోలుస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోచ్ గౌతమ్ గంభీర్‌పై శశి థరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. నాగ్‌పూర్‌లో గంభీర్‌ను కలిసిన థరూర్, ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. భారత్‌లో ప్రధానమంత్రి పదవి తర్వాత అత్యంత కష్టమైన బాధ్యత ఏదైనా ఉందంటే అది టీం ఇండియా కోచ్ పదవేనని ఆయన అభిప్రాయపడ్డారు.
"నా పాత మిత్రుడు గౌతమ్ గంభీర్‌తో చాలా మంచి చర్చ జరిగింది. ప్రతి రోజూ లక్షల మంది విమర్శిస్తున్నా, విపరీతమైన ఒత్తిడి ఉన్నా ఆయన ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. గంభీర్ చేస్తున్న ఈ సవాల్‌తో కూడిన ప్రయాణంలో ఆయనకు మరిన్ని విజయాలు లభించాలని కోరుకుంటున్నాను" అని ఎంపీ థరూర్ ట్వీట్ చేశారు.
గంభీర్ స్పందన..
ఎంపీ థరూర్ చేసిన ట్వీట్‌పై గౌతమ్ గంభీర్ కూడా సానుకూలంగా స్పందించారు. తనకు మద్దతుగా నిలిచినందుకు ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు. "ప్రస్తుత పరిస్థితులు చక్కబడితే, కోచ్ బాధ్యతలు, జట్టు ప్రణాళికలపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది" అని గంభీర్ పేర్కొన్నారు. భారత జట్టు ఇటీవల ఎదుర్కొంటున్న సవాళ్లు, విమర్శల నేపథ్యంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడి నుంచి గంభీర్‌కు ఇలాంటి మద్దతు లభించడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
READ MORE .....






