- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న గైని శ్రీనివాస్ గౌడ్
by Batti.Sumithra |
కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ పంచముఖి హనుమాన్ ఆలయ చైర్మన్ గైని శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు.

X
దిశ, కామారెడ్డిటౌన్ : కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ పంచముఖి హనుమాన్ ఆలయ చైర్మన్ గైని శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గౌడ్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ టీఆర్ఎస్ జెండా పండుగను ప్రతి గ్రామం, మండలం, జిల్లాలో జెండా గద్దెలు నిర్మించి జెండావిష్కరణ చేయాలని శ్రీనివాస్ గౌడ్‌కు ఆదేశించారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కామారెడ్డిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు రంగు నవీన చారి, సదాశివనగర్ మండల టీఆర్ఎస్ నాయకులు సాయ గౌడ్, సతీష్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






