‘దిశ’ ఎఫెక్ట్.. గిన్నెల వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు?

by Jakkula.Mamatha |

మండల పరిధిలోని ఆరికాలపాడు జన్నారం గ్రామాల మధ్య గిన్నెల వాగుపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు అనే వార్త ‘దిశ’ పేపర్‌లో ప్రచురణ జరిగింది.

‘దిశ’ ఎఫెక్ట్.. గిన్నెల వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు?
X

దిశ, ఏన్కూర్: మండల పరిధిలోని ఆరికాలపాడు జన్నారం గ్రామాల మధ్య గిన్నెల వాగుపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు అనే వార్త ‘దిశ’ పేపర్‌లో ప్రచురణ జరిగింది. వార్తకు స్పందించిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు కోసం ప్రభుత్వానికి తన సిఫార్సు లెటర్ తయారు చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపించారు. రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిధులు మంజూరు చేయడంతో ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు తొలగినట్లు అయింది. ఏనుకూరు, కొనిజర్ల, రఘునాథ్ పాలెం మండలాలకు అనుసంధానంగా గిన్నెల వాగుపై బ్రిడ్జి నిర్మాణం జరిగితే రాకపోకలు సులభతరంగా ఉంటాయని, వర్షాకాలం వచ్చిందంటే ఆరికాలపాడు, గద్దలగూడెంతోపాటు పలు గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించడానికి గ్రామస్తులకు సౌకర్యం ఉండేందుకు ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ 3.60 కోట్లతో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. త్వరలో బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలుపెట్టి బ్రిడ్జి నిర్మాణం వేగవంతంగా జరిగేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని తెలిపారు. నిధులు మంజూరు చేసినందుకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్‌కు మండల కాంగ్రెస్ నాయకుడు, ఆరికాలపాడు గ్రామానికి చెందిన వాసిరెడ్డి నాగేశ్వరరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story