రాష్ట్రలో కలకలం.. మ్యాన్ హోల్‌లో బయటపడ్డ అస్థిపంజరం

by Ajay Maddhiboyina |

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ‌ర‌ప‌ల్లిలో షాకింగ్ ఘ‌ట‌న వెలుగుచూసింది. ఓల్డ్ క‌ర్నూలు రోడ్డులో శుక్ర‌వారం జీహెచ్‌ఎంసీ మ్యాన్ హోల్స్ శుభ్రం చేస్తుండగా కుళ్లిపోయిన అస్థిపంజరం బయటపడింది.

రాష్ట్రలో కలకలం.. మ్యాన్ హోల్‌లో బయటపడ్డ అస్థిపంజరం
X

దిశ‌, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ‌ర‌ప‌ల్లిలో షాకింగ్ ఘ‌ట‌న వెలుగుచూసింది. ఓల్డ్ క‌ర్నూలు రోడ్డులో శుక్ర‌వారం జీహెచ్‌ఎంసీ మ్యాన్ హోల్స్ శుభ్రం చేస్తుండగా కుళ్లిపోయిన అస్థిపంజరం బయటపడింది. సమాచారం అందుకున్న మైలార్ దేవరపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అస్థిపంజరం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే మ్యాన్ హోల్ లో అస్థిపంజరం బయటపడటంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఎవరైనా హత్య చేసి మ్యాన్ హోల్ లో పడేశారా..లేదంటే ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్ లో పడిమరణించారా.. ఆత్మహత్య చేసుకుని చనిపోయారా అనే అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులకు కేవలం అస్థిపంజరం కుళ్లిన స్థితిలో కనిపించడంలో క్లూస్ దొరకడం కూడా కష్టంగా మారింది.

Next Story