- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాళ్లపల్లిగూడలో ఊర కుక్కల బీభత్సం
by Jakkula.Mamatha |
మంచాల మండలం పరిధిలోని తాళ్లపల్లిగూడ గ్రామంలో శనివారం ఉదయం కలకలం చోటుచేసుకుంది.

X
దిశ, మంచాల: మంచాల మండలం పరిధిలోని తాళ్లపల్లిగూడ గ్రామంలో శనివారం ఉదయం కలకలం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు గుంతకండ్ల బిక్షపతి యాదవ్ కు చెందిన గొర్రెల మంద పై ఊర కుక్కలు అకస్మాత్తుగా దాడి చేశాయి. ఈ ఘటనలో 2 గొర్రెలు మృతి చెందగా, 10 గొర్రెలు జాడ లేకుండా పోయినట్లు బాధితుడు వాపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే గ్రామ సర్పంచ్ శంకరయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత రైతును పరామర్శించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యుడు నవీన్ గౌడ్, యాదవ సంఘం అధ్యక్షుడు బి. నర్సింహులు కూడా హాజరయ్యారు. కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని, మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
Next Story






