- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న లార్క్ స్టూడియోస్ బ్యానర్‌లో జీవా భారీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?
వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే టాలెంటెడ్ హీరో జీవా, రావణ కళ్యాణం సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకట్ రాధాకృష్ణ కాంబోలో ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో జీవా వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల ‘సరస్వతి’ చిత్రంలో కీలక పాత్రలో మెప్పించిన ఆయన ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ‘గోల్‌మాల్’ చిత్రం చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు. తమిళ చిత్ర పరిశ్రమలో ‘గరుడన్’, ‘మామన్’ వంటి వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లార్క్ స్టూడియోస్ బ్యానర్‌లో జీవా తన తదుపరి భారీ చిత్రాన్ని చేయనున్నారు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే టాలెంటెడ్ హీరో జీవా, రావణ కళ్యాణం సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకట్ రాధాకృష్ణ కాంబోలో ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు.
ఈ క్రేజీ కాంబినేషన్ గురించి అధికారిక ప్రకటన సోషల్ మీడియా వేదికగా విడుదలైంది. ఇక ఈ సినిమాకు టాలీవుడ్, కోలీవుడ్‌లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం. సుకుమార్ విజువల్స్ అందించనున్నారు. ఆయన కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టాక్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి. జూలై నుంచే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. లార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల సమాచారాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ‘థింక్ మ్యూజిక్’ సొంతం చేసుకుంది. వరుస విజయాల ఫామ్‌లో ఉన్న ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






