- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రారంభానికి నోచుకోని ఫిరోజ్ నగర్ గ్రామ పంచాయతీ భవనం
మాడ్గుల మండలం ఫిరోజ్ నగర్ గ్రామ పంచాయతీ భవనం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని హంగులతో గత రెండున్నర సంవత్సరాల క్రితం నిర్మాణం పూర్తయిన ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు.

దిశ,మాడ్గుల: మాడ్గుల మండలం ఫిరోజ్ నగర్ గ్రామ పంచాయతీ భవనం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని హంగులతో గత రెండున్నర సంవత్సరాల క్రితం నిర్మాణం పూర్తయిన ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. గత ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసినప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు గ్రామ పంచాయతీ భవనాలు పూర్తి కాలేదని.. తమ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం పూర్తయిన ఇప్పటివరకు ఎందుకు ప్రారంభించలేదని గ్రామస్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. గ్రామ పంచాయతీ భవనం లేక ఇరుకైన అంగన్వాడీ కేంద్రంలోనే గ్రామ పరిపాలన సాగిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.






