అదే ‘పెద్ది’ కథకి అసలైన సోల్.. నందిని రెడ్డి

by Pulgam srinivas |

సినిమా చివర్లో రామ్ చరణ్ ఉంగరాన్ని ముక్కుకు పెట్టుకునే సన్నివేశమే ‘పెద్ది’ కథకు అసలైన సోల్ అంటూ నందిని రెడ్డి పేర్కొన్నారు.

అదే ‘పెద్ది’ కథకి అసలైన సోల్.. నందిని రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి తాజాగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి దర్శకత్వం వహించింది. ఈ సినిమా జూన్ 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నందిని రెడ్డి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ‘పెద్ది’ సినిమా చూశారా? చూస్తే ఎలా అనిపించింది? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన నందిని రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పెద్ది’ సినిమా విడుదలకు ముందు ఆ మూవీ మంచి విజయం సాధించాలని ఇండస్ట్రీలో చాలామంది కోరుకున్నారు. అలాంటి వారిలో నేను కూడా ఒకరిని.

ఎందుకంటే ఆ సినిమాకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తే ఆ ప్రభావం తర్వాత విడుదలయ్యే మా సినిమాలపై కూడా ఉంటుంది అనుకున్నాం అని ఆమె తెలిపారు. అలాగే కొన్ని రోజుల క్రితమే ‘పెద్ది’ సినిమా చూశాను. అందులో రామ్ చరణ్ నటన అద్భుతంగా అనిపించింది. ఆ పాత్ర కోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేసినట్లు కనిపించింది. ముఖ్యంగా ఐడెంటిటీ కోసం ఓ యువకుడు ఎంతగా పోరాడాడనే అంశం నాకు బాగా నచ్చింది అని చెప్పారు. ఇక సినిమా క్లైమాక్స్‌లో రామ్ చరణ్ పోడియంపై నిలబడి తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసుకుని ముక్కుకు పెట్టుకునే సన్నివేశం తనకు ఎంతో అద్భుతంగా అనిపించిందని, ఆ కథకు అదే అసలైన సోల్ అంటూ నందిని రెడ్డి పేర్కొన్నారు.

Next Story