ట్రంప్ మాటలకు విలువ ఇవ్వను : ఫ్రాన్స్ అధ్యక్షుడు

by Muthe.Rajitha |

ట్రంప్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ స్పందించారు.

ట్రంప్ మాటలకు విలువ ఇవ్వను : ఫ్రాన్స్ అధ్యక్షుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ తన భార్య బ్రిజిట్ మాక్రాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యక్తిగత, వివాదాస్పద వ్యాఖ్యలపై అత్యంత హుందాగా స్పందించారు. గురువారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ పర్యటనలో ఉన్న మాక్రాన్, మీడియాతో మాట్లాడుతూ.. ట్రంప్ వ్యాఖ్యలు ఏమాత్రం గౌరవప్రదంగా లేవని, ఒక దేశ అధ్యక్షుడి స్థాయికి తగినట్లుగా లేవని విమర్శించారు. ఇటీవల ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఫ్రాన్స్ నాటో (NATO)కు తగినంత మద్దతు ఇవ్వడం లేదని విమర్శిస్తూనే, మాక్రాన్ వ్యక్తిగత జీవితంపై, గతంలో వైరల్ అయిన ఒక వీడియోను ఉద్దేశించి ఎగతాళిగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై స్పందించడం తన సమయం వృథా అని పేర్కొన్న మాక్రాన్.. ఇలాంటి వ్యక్తిగత దూషణల కంటే పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడం, కాల్పుల విరమణ, చర్చల పునరుద్ధరణ వంటి ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలని ట్రంప్‌కు హితవు పలికారు. ఇరువురి వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో, ముఖ్యంగా నాటో కూటమిలోని అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది.

Next Story