సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్.. సంచలన బిల్లుకు ఫ్రాన్స్ పార్లమెంట్ ఆమోదం

by Kema Shiva Kumar |

ఫ్రాన్స్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్.. సంచలన బిల్లుకు ఫ్రాన్స్ పార్లమెంట్ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్రాన్స్ (France) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా (Social Media)ను నిషేధించే కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన ఓటింగ్‌లో ఫ్రాన్స్ దిగువ సభ ఈ బిల్లును 116-23 ఓట్ల తేడాతో ఆమోదించింది. సైబర్ బెదిరింపులు (Cyberbullying), నిద్రలేమి, మానసిక ఆరోగ్య సమస్యల నుంచి పిల్లలను రక్షించడమే ఉద్దేశంగా ఈ బిల్లు రూపొందించారు. అయితే, 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్‌ను క్రియేట్ చేయడం చట్టవిరుద్ధమని ఈ బిల్లు చెబుతోంది. ఈ కొత్తం సెప్టెంబర్ 2026 కొత్త విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియాతో పాటు, హైస్కూళ్లలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని కూడా పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) మాట్లాడుతూ.. 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్‌ను తాను సమర్థిస్తున్నానని అన్నారు. తమ పిల్లల మెదళ్లు, భావోద్వేగాలు అమ్మకానికి లేవని ఆయన కామెంట్ చేశారు.

కాగా, టిక్‌టాక్ (TikTok) వంటి ప్లాట్‌ఫారమ్‌లలో హానికరమైన కంటెంట్ కారణంగా తమ పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఏడుగురు కుటుంబాలు దావా వేయడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆస్ట్రేలియా ఇటీవల 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం చేయగా.. ఫ్రాన్స్ కూడా ఇప్పుడు అదే నిర్ణయం తీసుకున్నది.

Next Story