ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

by S Gopi |   (  Updated:2022-03-15 08:23:23  IST  )

దిశ, కోటపల్లి: మండలంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ లో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..Free medical camp under the Alaya Foundation

ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
X

దిశ, కోటపల్లి: మండలంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ లో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపీపీ మంత్రి సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ వ్యాధులైన స్వైన్‌ ఫ్లూ, డెంగీ, కరోనా తదితర వ్యాధులపై పిల్లలకు అవగాహన కల్పించారు. మాతృ శిశుమరణాలు జరగకుండా, పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలన్నారు. అలాగే బాల్య వివాహాల వల్ల నష్టాలు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాన్నారు. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా పరీక్షలు, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి తహశీల్దార్ దేశ్ ముఖ్ పాండే, చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు, ఉపాధ్యాయులు, డాక్టర్లు పాల్గొన్నారు.






Next Story