గుట్కా, పాన్ నమిలే వారికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-02 15:47:46  IST  )

వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మెడికల్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం, క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప తెలిపారు.

గుట్కా, పాన్ నమిలే వారికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మెడికల్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం, క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప తెలిపారు. క్యాన్సర్ అవగాహన ర్యాలీ ఇవాళ ఉదయం 9 గంటలకు ట్రామా సెంటర్‌లోని ఎమర్జెన్సీ భవనం నుంచి ప్రారంభమవుతుంది. ర్యాలీ అనంతరం పాత భవనంలోని లెర్నింగ్ సెంటర్‌లో క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. తర్వాత సమాచార కేంద్రం వద్ద ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం చేపడతారు. ఈ శిబిరంలో సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్, 30-60 ఏళ్ల మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, గుట్కా, పాన్ నమిలే వారు, ధూమపానం చేసే వారికి ప్రత్యేకంగా ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చని ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత పరీక్షలు చేయించుకుని క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాలని నిమ్స్ ఆయన కోరారు.

Next Story