మూడు రోజుల్లో రూ. 17 వేల కోట్లకు పైగా విదేశీ నిధులు వెనక్కి!

by Disha Web |
మూడు రోజుల్లో రూ. 17 వేల కోట్లకు పైగా విదేశీ నిధులు వెనక్కి!
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ కారణంగా ఏర్పడిన అనిశ్చితి వల్ల ముడి చమురు ధరలు పెరగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీంతో ఈ ఏడాది మార్చిలో కేవలం మూడు సెషన్లలో విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ల నుంచి ఏకంగా రూ. 17, 537 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. తాజా డిపాజిటరీల డేటా ప్రకారం.. ఈ నెలలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) ఈక్విటీల నుంచి రూ. 14,721 కోట్లను, డేట్ విభాగం నుంచి రూ. 2,808 కోట్లు, హైబ్రిడ్ సాధనాల నుంచి రూ. 9 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు.

యుద్ధ పరిణామాలు, ముడి చమురు ధరల వల్ల అంతర్జాతీయంగా మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి ఉందని, దీనికి తోడు రూపాయి మారకం విలువ కూడా క్షీణిస్తుండటంతో డెట్ విభాగం నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమారు అన్నారు. అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి మార్కెట్లలో అంతర్జాతీయ పరిణామాలతో పెట్టుబడులు వెనక్కి వెళ్లడం ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుందని, దీనివల్ల తోడు కంపెనీల ఆదాయాలు క్షీణించడం, ఆర్థిక వృద్ధి మందగించడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మార్నింగ్ శ్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు.


Next Story

Most Viewed