- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భగ్గుమన్న పాత కక్షలు.. నలుగురు మహిళలపై గొడ్డలితో దాడి
by Muthe.Rajitha |
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఓ వ్యక్తి గొడ్డలితో నలుగురిని నరికిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఓ వ్యక్తి గొడ్డలితో నలుగురిని నరికిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. పట్టణానికి చెందిన ముప్పిడి వివేక్ అనే వ్యక్తి కుటుంబ తగాదాలు, పాత కక్షల కారణంగా నలుగురు మహిళలపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో జీలుగులమ్మ అనే 47 ఏళ్ల మహిళ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. చుక్కమ్మ, ఉషారాణి, ధనలక్ష్మి అనే మరో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడగా.. వారిని వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ గొడవలు, భూ వివాదాలే ఈ హత్యాయత్నానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. కాగా ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు.
Next Story






