నల్లగొండలో తీవ్ర విషాదం.. ఒకే ఇంట్లో నలుగురి మృతదేహాలు

by Malleboina Mahesh |   (  Updated:2026-06-22 14:31:01  IST  )

నల్లగొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య చేసుకొవడం సంచలనంగా మారింది.

నల్లగొండలో తీవ్ర విషాదం.. ఒకే ఇంట్లో నలుగురి మృతదేహాలు
X

దిశ, వెబ్ డెస్క్: నల్లగొండలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషాద సంఘటన పట్టణంలోని తెలంగాణ కాలనీ (Telangana Colony)లో ఓ ఇంట్లో చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం స్థానికంగా కలకలం గా మారింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో కుళ్లిన స్థితిలో మృతదేహాలను పోలీసులు గుర్తించారు. దాదాపు 4-5 రోజుల క్రితం వారు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే స్థానికులు తెలిపిన వివరాలతో.. మృతి చెందిన కుటుంబానికి చెందిన మరో యువకుడు కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు. దీంతో హత్య కోణంలో నల్గొండ వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story