మావోయిస్టులతో మాకు ప్రమాదం పొంచి ఉంది: మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

పార్టీ మార్పు వార్తలపై తెలంగాణ బీజేపీ నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందించారు.

మావోయిస్టులతో మాకు ప్రమాదం పొంచి ఉంది: మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మార్పు వార్తలపై తెలంగాణ బీజేపీ నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టు(Maoist Party)ల నుంచి మాకు ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల అలజడి మొదలైంది. అరెస్ట్ అయిన మావోయిస్టు పార్టీ సానుభూతిపరులంతా అచ్చంపేట ఎమ్మెల్యే మనుషులే. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లాను. నా చివరి శ్వాస వరకూ బీజేపీలోనే కొనసాగుతాను. బీజేపీలో చాలా కంఫర్ట్‌గా ఉన్నాను. నాకు ఎవరితో ఇబ్బందిలేదు. అందరూ సహకరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీనే అధికారంలోకి వస్తుంది. ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదు. ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే బీఆర్ఎస్ తిరిగి పుంజుకునే అవకాశాలు లేవు. కాంగ్రెస్‌పై కూడా తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ప్రత్యామ్నాయం బీజేపీనే అని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం. ప్రపలంతా బీజేపీవైపే ఉన్నారు’ అని గువ్వల బాలరాజు హాట్ కామెంట్స్ చేశారు.

Next Story