- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మంగళవారం మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మంగళవారం మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అడ్డుకుని అతడిని కాపాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరుడు తనపై తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని రాజేందర్ రెడ్డి ఆరోపించినట్లు సమాచారం. ఘటన అనంతరం అతడిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.






